తాండూరు బంజార భవన్‌కు రాజయోగం
– రూ. 2 కోట్లు మంజూరు చేసిన సర్కారు
– మొత్తం రూ.3 కోట్లకు పెరిగిన నిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్మించే బంజార భవన్‌కు రాజయోగం కలిగింది. ఈ బంజార భవన్‌కు అదనంగా రూ. 2కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు సర్కారు జీఓ 153ను జారీ చేసింది. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషితో నిర్మిస్తున్న బంజార భవన్‌కు ఈ రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయి. తాండూరు పట్టణ శివారు కందనెల్లి తండాకు వెళ్లే మార్గంలో నిర్మించే బంజార భవన్‌కు గతంలోనే ఎస్డీఎఫ్ నిధుల కింద రూ. 1 కోటి కేటాయించిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంత్రి సత్యవతి రాథోడ్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో బంజార భవన్‌కు ప్రభుత్వం అదనంగా రూ. 2 కోట్లను కేటాయించింది. దీంతో తాండూరు బంజార భవన్ కు రూ. 3కోట్లు నిధులు మంజూరయ్యాయి. బంజార భవన్‌కు నిధులు కేటాయించడం పట్ల తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, గిరిజన, బంజార సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

