ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి..!
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్
– తాండూరు అసెంబ్లీ స్థానానికి దరఖాస్తు సమర్పణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క చాన్స్ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కోరారు. శనివారం బీజేపీ పార్టీ కమిటికి తాండూరు అసెంబ్లీ స్థానం పోటీ కోసం దరఖాస్తును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తును సమర్పించడం జరిగిందన్నారు. పార్టీ అధిష్టానం తనకు అవకాశం ఇస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలు, తాండూరు ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తామని అన్నారు. ఈ మేరకు అధిష్టానం అవకాశం కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు తాండూరు అసెంబ్లీ స్థానానికి ఇది వరకే బీజేపీ నుంచి పటేల్ రవిశంకర్, పటేల్ జయశ్రీ, లక్ష్మారెడ్డి, యు.రమేష్‌ కుమార్‌లు దరఖాస్తులు అందజేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!