బరితెగిస్తే బడులు సీజ్..!
– ఫీజులుం, బుక్స్ దందాలు చేయొద్దు
– పర్మిషన్ లేకుండా స్కూళ్లు నడిపిస్తే చర్యలు
– తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా స్కూళ్లు నడిపిస్తే చర్యలు తప్పవని తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ హెచ్చరించారు.

గురువారం తాండూరులో తాండూరు మండలం, పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ పాఠశాలల ప్రాంగణంలో ఎలాంటి పుస్తకాలు, నోటు బుక్స్ విక్రయించరాదన్నారు.

జీఓ ప్రకారం అధిక ఫీజులు వసూలు చేయరాదన్నారు. ట్యూషన్ ఫీజులు తప్పా.. ఎలాంటి ఇతర ఫీజులు తీసుకోరాదన్నారు. ఫీజుల వి షయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకరావద్దన్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని, అవసరమైతే గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్లు, కరస్పాడెంట్లు పాల్గొన్నారు.

ఇదికూడ చదవండి…

