బీజేపీని గద్దె దించడమే లక్ష్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీని గద్దె దించడమే లక్ష్యం
– 14 నుంచి ఇంటింటికి సీపీఐ
– సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మీ పండిత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యమని సీపీఐ వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మీ పండిత్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో సీపీఐ నాయకులు ఫీర్ మహమ్మద్ ఆద్వర్యంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన విజయలక్ష్మీ పండిత్ సమక్షంలో ఈనెల 14 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో చేపడుతున్న ఇంటింటికి సీపీఐ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని గద్దె దించడమే ధ్యేయమన్నారు. బీజేపీకి హఠావో.. దేశ్ కి బచావో అనే నినాదాంతో ఈనెల 9న హైదరాబాద్లో సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 14 నుంచి ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని చేడపతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పాదయాత్ర కూడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను అందరు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, బషీర్, వెంకటేష్, నారాయణ, మైమూద్, అనంతయ్య, నర్సింలు, అబ్దుల్లా, రవీందర్, మునీర్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.