మహాత్మ జ్యోతిబాపూలేను గౌరవించుకుందాం

తాండూరు రాజకీయం వికారాబాద్

మహాత్మ జ్యోతిబాపూలేను గౌరవించుకుందాం
– ప్రతిష్టాత్మకంగా పూలే జయంతి ఉత్సవాలు
– జయంతి ఉత్సవ కమిటి వైస్ చైర్మన్ గా ఈడిగ శ్రీనివాస్ గౌడ్ నియామకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతదేశ మొట్ట మొదటి సామాజిక ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిబాపూలేను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జయంతి ఉత్సవ కమిటి వైస్ చైర్మన్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటిలో బషీరాబాద్ మండలం రెడ్డిగణాపూర్ గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ గా నియమించింది. ఈ విషయాన్ని శనివారం ఈడిగ శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేసిన గొప్ప సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని ఈనెల 11న ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందున్నారు. ఇందులో భాగంగా గ్రామగ్రామాన మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఆ మహనీయున్ని గౌరవించుకుందామని పిలుపునిచ్చారు. అదేవిధంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ కమిటిలో వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించడం పట్ల సీఎం కేసీఆర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.