ప్రలోభకారుల్లారా ఖబడ్దార్..!
– పిరాయింపులను ప్రోత్రహిస్తే బొందపెడతాం
– అమ్ముడు పోయినోళ్లు తిరిగొచ్చేయండి
– లేదంటే వెన్నుపోటుదారులపై చర్యలు
– స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్న నేతల్లా ఖడబ్దార్ అంటూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. స్వార్థం కోసం పార్టీ మారిన నేతలకు తిరిగి వచ్చేయాలని అవకాశం ఇస్తూనే.. చాన్స్ తీసుకోకుంటే వెన్నుపోటు దారులను వదిలేదని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వీడి మరో పార్టీలో చేరుతున్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపుతో పాటు పదవులు. అభివృద్ధి పొందిన నేతలు స్వార్థం కోసం పార్టీలు మారడంపై మండిపడ్డారు.

గతంలో బీజేపీ పార్టీ రూ. 100 కోట్లు, రూ. 1000 కోట్ల కాంట్రాక్టులు, పదవులు ఇస్తామన్నా కూడా లొంగలేదని, తాండూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీగా బీజేపీ ద్రోహాన్ని బయట పెట్టడం జరిగిందని గుర్తుచేశారు. తాను చేసిన సాహసానికి సీఎం కేసీఆర్ తో పాటు ప్రజలు అభినందించారని అన్నారు. కాని తాండూరులో సంబంధం లేని కొంతమంది వ్యక్తుల వల్ల బీఆర్ఎస్ పార్టీని దిగజార్చేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని, తనను ఓడిచేందుకు ఓ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రలోభాలకు లొంగి కొంత మంది రూ. 50వేలకు, లక్షలకు బజారుల్లో గేదేల్లా అమ్ముడు పోతున్నారని అన్నారు. ఈ నీచ, కుట్ర రాజకీయాలను ప్రజలందరు గమనిస్తున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని, తనను బంపర్ మెజార్టీతో గెలిపించడం ఖాయమన్నారు. పార్టీ మారి అమ్ముడు పోయిన నేతలను తరిమి కొట్టాలని, ప్రజల్లోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రలోభాలకు గురిచేస్తున్న పార్టీ నేతలకు ఖబడ్డార్ అని హెచ్చరించారు. నీచ రాజకీయాలకు పాల్పడితే టీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజలు బొంద పెడతారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, యువత సంకల్పంతో పాటు, తాండూరు ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి ఎమ్మెల్యే కావడం ఖాయమన్నారు. అవకాశం ఉంటే పార్టీ మారిన నేతలు తిరిగి పార్టీలో చేరే అవకాశం కల్పిస్తామని, లేదంటే వెన్నుపోటుదారులను ఎవ్వరిని వదిలి పెట్టేది లేదన్నారు. దసరా తరువాత పక్కా ప్రణాళికలతో ప్రజల్లోకి వస్తున్నామన్నారు.
ఎవ్వరూ ఎన్ని కుట్రలు చేసినా.. తగ్గేది లేదు, బెదిరేది లేదన్నారు. తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి వర్గం, ఎమ్మెల్యే వర్గం అంటూ ఏది లేదని, అందరూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి, తన గెలుపుకు పనిచేస్తున్నారని అన్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని చేస్తున్న ఆరోపణలను కొట్టి పారేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి. డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్, నాయకులు శ్రీనివాస్ చారి. అజయ్ ప్రసాద్, వెంకట్రామ్ రెడ్డి, సిద్రాల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కోహీర్ శ్రీనివాస్ యాదవ్, ఇందర్ చెడ్ రాజు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, ఎంపీటీసీలు వసంత్ కుమార్, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, సర్పంచులు రాజప్ప గౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

