కొత్త విమానాశ్రాయాల ఏర్పాటుకు కేంద్రం సానుకూలం
– అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్‌తో భేటీ
– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
దర్శిని బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రాయాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాల అంశాలు చర్చించేందుకే సీఎం కేసీఆర్‌ను కలిసినట్టు.. కేంద్రమంత్రిగా ప్రధానమంత్రి మోడీ లక్ష్యాలను సాధించడం కోసమే భేటీ అయ్యామని తెలిపారు. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్ బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని, కేవలం కొన్ని సంవత్సరాల పాటు లీజుకు మాత్రమే ఇస్తామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలప డుతోందని, త్వరలోనే అధికారంలోకి వస్తామని. ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీతో పోరాటం కొనసాగు తుందని వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఉప ఎన్నిక, కార్పోరేషన్. ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ ప్రజల ఆదరణను సొంతం చేసుకుందని వివరించారు. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

