ఫిల్లలపై పెట్టుబడికి బెస్ట్‌ స్కీమ్స్‌..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఫిల్లలపై పెట్టుబడికి బెస్ట్‌ స్కీమ్స్‌..!
– ప్రభుత్వ అందుబాటులో పథకాలు
– 6 ఉత్తమ స్కీంల గురించి తెలుసుకోండి
దర్శిని డెస్క్‌: ధనవంతులతో పాటు పేద, మద్యతరగతి కుంటుబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు వారిపై కొంత పెట్టుబడి పెడుతుంటారు. వారు పెద్ద అయ్యాక ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారు. పిల్లలపై పెట్టుబడి పెట్టేందుకు రకరకాల ప్రభుత్వ, ప్రైవేటు స్కీంలలో పెట్టుబడులు పెడుతుంటారు. ప్రభుత్వ స్కీంలకు అయితే భరోసా ఉంటుంది. కాని ప్రైవేటు స్కీంలపై సంస్థలు ఎన్ని హామిలు ఇచ్చినా చివరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే కొన్ని స్కీంలలో పిల్లలపై పెట్టుబడి పెట్టేందుకు బెస్ట్‌గా నిలుస్తున్నాయి. అవేంటో కింద చదివి తెలుసుకోండి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పీపీఎఫ్ (PPF) దీర్ఘకాల పెట్టుబడి ఆప్షన్. ఇది సురక్షితమైన పెట్టుబడి, అధిక వడ్డీ రేటును కూడా అందిస్తుంది. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు సేవ్ చేయవచ్చు. తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా కనీసం రూ.500తో ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టొచ్చు. ఉదాహరణకు పిల్లల విద్య కోసం 15 ఏళ్లలో రూ.25 లక్షలు కావాలనుకుంటే ఏడాదికి రూ.1 లక్ష వరకు సేవ్ చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ద్వారా పొందే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఆడపిల్లల చదువు, పెళ్లి వ్యయాల నిమిత్తం తల్లిదండ్రులను సేవింగ్స్ విషయంలో ప్రోత్సహించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని (Sukanya Samriddhi Account) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం అధిక వడ్డీ రేటు అందించడంతోపాటు పన్ను ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్‌సీ)
ఎన్ఎస్‌సీ (NSC) ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఐదేళ్ల లాక్-ఇన్ పిరియడ్‌లో ఇదే వడ్డీ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో ఆర్జించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఇన్వెస్టర్లు పన్ను మినహాయింపును పొందే వెసులుబాటు ఉంటుంది.

ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)…
ఈఎల్ఎస్ఎస్ (ELSS) ఇదొక మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. 3 ఏళ్ల లాక్-ఇన్ పిరియడ్‌తో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అధిక రిటర్నులు పొందే అవకాశం ఉంది. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఈ స్కీమ్‌లో మంచి లాభాలే కాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే వెసులుబాటు ఉంటుంది.

కిసాన్ వికాస్ పాత్ర (KVP)..
కిసాన్ వికాస్ పాత్ర (KVP) ఇది ఒక ఫిక్స్‌డ్-ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. 124 నెలల ఫిక్స్‌డ్ కాలపరిమితి తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ రెట్టింపు అవుతుంది. దీనిపై ఆర్జించే వడ్డీపై ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన ఒక సేవింగ్స్ స్కీమ్. ఈ స్కీమ్‌లో అధిక వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే తమ పిల్లల తరపున ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు.