యువత స్వయం ఉపాధిలో రాణించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– శ్రీ ఎంటర్ ప్రైజెస్‌ను ప్రారంభించిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: యువత తమ నైపుణ్యంతో స్వయం ఉపాధిలో రాణించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఎంటర్ ప్రైజెస్‌ను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సదర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తమలోని నైపుణ్యంతో స్వయం ఉపాధితో పొందాలన్నారు. తమ కాళ్లపై తాము నిలబడి స్వయం ఉపాధిలో రాణించాలని ఆకాంక్షించారు. శ్రీ ఎంటర్ ప్రైజెస్ ను ఏర్పాటు చేసుకున్న నిర్వకులకు అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు చందు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

