యువతతోనే సమాజాభివృద్ధి
– బీసీ సంఘం తాండూరు కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్
– బీసీ యువజన సంఘం తాండూరు మండల అధ్యక్షులుగా బసంత్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : సమాజంలో యువత తోడ్పాటుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు మండలం మిట్టబాస్పల్లిలో బీసీ యువజన సంఘ సమావేశం నిర్వహించారు. బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం తాండూరు మండల అధ్యక్షులుగా బసంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజ్ కుమార్ బసంత్‌కు నియామకపత్రం అందించి సన్మానించారు.

అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు యువతే కీలకమన్నారు. కావున యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీపీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణచారి, బోయ రాధాకృష్ణ, రాము ముదిరాజ్ టైలర్ రమేష్. తుపాకుల అనిల్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్, స్వేరోస్ సభ్యులు శివరాజ్, బస్వరాజ్, అంజయ్య, శివ నరే0దర్ తదితరులు పాల్గొన్నారు.


