సీఈఐఆర్‌తో మరో ఫోన్ రికవరీ..!

క్రైం టెక్నాలజీ తాండూరు వికారాబాద్

సీఈఐఆర్‌తో మరో ఫోన్ రికవరీ..!
– సీఐ చేతుల మీదుగా బాధితునికి అప్పగింత
– ఫోన్ పోతే ఫిర్యాదు చేయండి: సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం కొత్త టెక్నాలజీ ద్వారా ప్రవేశ పెట్టిన సీఈఐఆర్ తో తాండూరు పోలీసులు మరో ఫోన్ ను రికవరీ చేశారు. ఇందుకు సంబంధించి శనివారం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 3న రాథోడ్ నీల్యానాయక్ అనే వ్యక్తి తన వన్ ప్లస్ ఫోన్ తాండూరు పట్టణంలోని నెహ్రు గంజ్ ప్రాంతంలో పొగొట్టుకున్నారు. దీంతో బాధితుడు తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఈఐఆర్ వ్యవస్థలో ఫోన్ వివరాలను నమోదు చేసి ట్రేసింగ్ చేశారు. రికవరీ చేసిన ఫోన్‌ను శనివారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడు నీల్యా నాయక్ పట్టణ పోలీస్టేషన్ లో తిరిగి అప్పగించారు.

ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బాధితులు ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన సీఈఐఆర్ ద్వారా వివరాలు నమోదు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. దానిని రికవరీ చేసి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ ఉన్నారు.