జాతీయ లోక్ అదాలత్‌లో 70 కేసుల రాజీ

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్


జాతీయ లోక్ అదాలత్‌లో 70 కేసుల రాజీ
– న్యాయమూర్తి శివలీల ఆధ్వర్యంలో పరిష్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 70 కేసులు పరిష్కారం అయ్యాయి.  న్యాయమూర్తి శివలీల, అడిషనల్ జడ్జీ అంబటి ప్రణయల ఆధ్వర్యంలో ఈ కేసులను పరిష్కరించారు.

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని కక్షిదారులు న్యాయస్థానంకు వచ్చారు. న్యాయమూర్తి కక్షిదారులతో మాట్లాడి కేసులలో రాజీకి అంగీకరించడంతో కేసులను పరిష్కరించారు. ఇందులో సీసీ ఎక్సైజ్ కేసులు 16, సీసీ కేసులు 21, ఎన్ఐ సీసీ కేసులు 2, ఓఎస్ కేసులు 2, క్రైమ్ కేసులు 15, ఇతర కేసుల 14 మొత్తం 70 కేసులు పరిష్కారం అయినట్లు  కోర్టు ప్రతినిధులు ప్రకటించారు.
kvcs
ఈ కార్యక్రమంలో పీపీ అన్వేష్ సింగ్. లోక్ అదాలత్ మెంబర్స్ మనోహర్ రావు, చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు పినమోని శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, సీనీయర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయ అధికారులు, మహిళ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రేపు తాండూరులో పవర్ కట్..!