కార్యదర్శుల సమ్మె సర్కారుకు సిగ్గుచేటు

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్యదర్శుల సమ్మె సర్కారుకు సిగ్గుచేటు
– ఆర్. కృష్ణయ్య దృష్టికి జేపీఎస్ ల డిమాండ్లు తీసుకెళ్తాము
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
– పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేపట్టడం సర్కారుకు సిగ్గుచేటు అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో చేపట్టిన సమ్మెకు బీసీ సంఘం తరుపున రాజ్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శులు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తుండడం తెలంగాణ ప్రభుత్వానికి అవమానకరమని అన్నారు. తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చేయడంలో గ్రామపంచాయత కార్యదర్శులు పాత్ర ఎంతో ముఖ్యం అని, అలాంటి వారిని విస్మరించడం సరియైన కాదన్నారు. పంచాయతీ కార్యదర్శులకు బీసీ సంఘం పూర్తి పూర్తిగా అండగా ఉంటుందని వారి డిమాండ్లు నెరవేర వరకు బీసీ సంఘం ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తుందని అన్నారు. జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య దృష్టికి సమ్మెను తీసుకెళ్లి వారి డిమాండ్లను నెరవేర్చే విధంగా కృషి చేస్తామని రాజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ శుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యాలాల్ మరియు బషీరాబాద్ మండల అధ్యక్షులు లక్ష్మణాచారి, నరేందర్, సోషల్ మీడియా ఇన్ఛార్జి బసవరజ్, బి సి యువనయకులు రమేశ్, సురేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తారక్ చారి, ఉదయ్, వెంకటరెడ్డి, సునీల్ కుమార్, సుధాకర్, శ్రీనివాస్, కామేష్, అఫ్రోజ్, మోహన్, దినేష్, పావని, దీప, లలిత, తదితరులు పాల్గొన్నారు.