నాపరాతి కార్మికుడిపై ప్రతాపం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నాపరాతి కార్మికుడిపై ప్రతాపం..!
– అప్పు చెల్లించలేదని చితకొట్టిన యజమాని
– గదిలో బంధించి చిత్ర హింసలు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
– పోలీసులు ఏమన్నారంటే..?
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తీసుకున్న అప్పు చెల్లించలేదని నాపదాతి కార్మికుడిపై పాలిషింగ్ యూనిట్ యజమాని ప్రతాపం చూపించారు. గదిలో బంధించి చితకబాది చిత్రహింసలకు గురిచేశాడు. బాధిత కుటుంభీకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వి వరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన ద్యావని నర్సింలుకు పెద్ద లక్ష్మీ, చిన్న లక్ష్మీ ఇద్దరు భార్యలతో పాటు ఆరుగురు సంతానం ఉన్నారు. గత 13 నెలల క్రితం నర్సింలు తాండూరు – గౌతాపూర్ రోడ్డు మార్గంలో ఉన్న సులేమాన్ అనే వ్యక్తికి చెందిన పాలిషింగ్ యూనిట్లో పనికి కుదిరారు. పనిలో చేరే ముందే నర్సింలు యజమాని సులేమాన్ దగ్గర రూ. 1 లక్ష 50 వేలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. దీంతో పాటు ఇతరుల పేరుతో మరో రూ. 60వేలు అప్పు చేశాడు. కొన్ని రోజుల తరువాత యజమాని సులేమాన్ ఆదేశాల మేరకు అతని సోదరుడు ఇజ్రాస్ వద్ద పనిచేసేందుకు వెళ్లారు. అక్కడ పనిచేసుకుంటూ కొంత అప్పు చెల్లించాడు. పలు కారణాల వల్ల యజమాని వ్యవహారం నచ్చకపోవడంతో గత మూడు నెలల క్రితం యజమానికి చెప్పకుండా నర్సింలు భార్య పిల్లలతో కలిసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. సదాశివ పేట్ లో భార్య పిల్లలతో కలిసి పనిచేసుకుంటూ ఉంటున్నాడు. (ఇంకా వుంది…)

కారులో బంధించుకొచ్చి…
ఈ విషయం తెలుసుకున్న యజమాని సులేమాన్ గురువారం కారులో ఇద్దరు వ్యక్తులతో కలిసి నర్సింలు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. అదే రోజు నర్సింలును తీసుకుని ముందు పనిచేసిన పాలిషింగ్ యూనిట్ వద్దకు తీసుకవచ్చారు. శుక్రవారం యజమాని, నర్సింలు మద్య అప్పు విషయంపై చర్చలు జరిగాయి. యజమాని సులేమాన్ తీసుకున్న అప్పును వెంటనే చెల్లించాలని నర్సింలుపై ఒత్తిడి తెచ్చారు. ఇదే క్రమంలో సులేమాన్ నర్సింలుపై చిత్రహింసలకు పాల్పడ్డారు. పాలిషింగ్ యూనిట్లోని బెల్టుతో నర్సింలుపై దాడి చేసి చితక బాదారు. ఈ విషయం తెలుసుకున్న నర్సింలు పెద్ద భార్య లక్ష్మి ఆదేరోజు రాత్రి 11 గంటలకు కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి నర్సింలుసు అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బాధితుడు నర్సింలు భార్య లక్ష్మి తన భర్తను చితకబాది చిత్రహింసలకు గురిచేశారని పాలిషింగ్ యూనిట్ యజమాని సులేమాన్‌పై ఫిర్యాదు చేసింది. అదేవిధంగా డబ్బుల విషయంపై తమతో తెల్లకాగితంపై సంతకాలు తీసుకున్నారని, దీనిని వీడియో కూడా తీశారని తెలిపింది. అనంతరం చిత్రహింసలకు గురైన కార్మికుడు నర్సింలును చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నర్సింలు పెరిగిరి పేట్ వెళ్లారు. (ఇంకా వుంది…)

పోలీసులు ఏమన్నారంటే..?
సోమవారం ఈ విషయం తెలుసుకున్న సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన తాండూరు మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, అంజిలప్ప, వీరణ్ణ మరికొందరు కరణ్ కోట్ పోలీస్టేషన్ కు చేరుకుని పోలీసులతో పాటు రూరల్ సీఐ రాంబాబును కలిసి ఫిర్యాదు చేశారు.

నాపరాతి కార్మికుడిపై దాడి చేసిన పాలిషింగ్ యూనిట్ యజమాని సులేమాన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుడిపై దాడి సంఘటన తెలుసుకున్న వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పి.రాములు, మల్కాపూర్ గని కార్మిక సంఘం మాజీ వైస్ చైర్మన్ పండరి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్‌ తదితరులు పోలీస్టేషన్ కు చేరుకుని యజమానిపై ఫిర్యాదు చేశారు. బాధితుడు నర్సింలుకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రాంబాబు కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డితో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

పంచాయతీ కార్యదర్శులకు డెడ్‌లైన్‌..!
– సమ్మె విరమించాలని సోకాజ్ నోటీసులు
– విధుల్లో చేరకుంటే ఎలాంటి చర్యలు ఉంటాయంటే..?
https://dharshininews.com/17011