హస్తానిదే.. అఖండ విజయం
– కన్నడ పోరులో కాంగ్రెస్కు పట్టం
– మ్యాజిక్ ఫిగర్ దాటి గెలుపు
దర్శిని డెస్క్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం ముంగిట నిలిచింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత రీతిలో ఫలితాలను సాధించింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 135 స్థానాలు చేజిక్కించుకుంది. 1 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ (113) ఎప్పుడో దాటేసిన కాంగ్రెస్ అధికార బీజేపీపై స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ప్రస్తుతం బీజేపీ 64 స్థానాల్లో గెలుపోందింది. జనతాదళ్ (ఎస్) 19 స్థానాల్లో గెలిచి, ఒక చోట ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల గెలిచారు. బీజేపీ తరఫున ప్రధాని మోడీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 64 స్థానాలకే పరిమితమైంది.
ప్రముఖ స్థానాల గెలుపులు ఇవే..
కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విజయం సాధించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి భాజపా నేత బసవరాజ్ బొమ్మై షిగ్గావ్లో గెలుపొందారు.
వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య విజయం సాధించారు.
చెన్నపట్టణ స్థానం నుంచి మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి గెలుపొందగా.. ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి రామనగరలో ఓటమిపాలయ్యారు.
గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి విజయం సాధించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్లో గెలుపొందారు.
హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్లో మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్) ఓడిపోయారు.
శికారిపురలో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర (భాజపా) విజయం సాధించారు.
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ కనకపుర స్థానం నుంచి విజయం సాధించారు.
ఎల్లాపురా స్థానంలో భాజపా అభ్యర్థి శివరామ్ గెలుపొందారు.
హసన్ నియోజకవర్గంలో జేడీఎస్ నేత స్వరూప్ విజయం సాధించారు.
ఇది కూడా చదవండి…
హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..!
– వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు
– కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
https://dharshininews.com/17144

