కొలువునుముంచిన రివాల్వర్ వీడియో
– ఇన్‌స్టాగ్రామ్‌తో ఉద్యోగాన్ని ఊడకొట్టుకున్న లేడీకానిస్టేబుల్
దర్శిని బ్యూరో : సోషల్ మీడీయాలో స్టార్ కావాలని ఆశపడిన లేడీ కానిస్టేబుల్ చేసిన ఓ రివాల్వార్ వీడియో ఆమె కొలువును ముంచేసింది. కాన్పూర్‌కు చెందిన ప్రియాంక మిశ్రా 2020లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. శిక్షణ పొందిన తరువాత మూడు నెలల క్రితం ఆగ్రాలోని ఎంఎం గేట్ పోలీస్ స్టేషన్‌లో విధులలో చేరారు. సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో ఓ వీడియో చేసింది. తాను చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఉద్యోగం ఊడిపోయింది. ఆమె చేసిన వీడియో మామూలుగా చేస్తే పర్వాలేదు కానీ పోలీస్ యూనిఫాంలో ఉండి రివాల్వర్ చేతిలో పట్టుకొని సినిమాలో మాదిరిగా డైలాగ్స్ చెబుతూ వీడియో చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే ఈ వీడియోను చూసిన నెటిజన్లు మండిపడ్డారు. ఓ పోలీసు అయి ఉండీ ఇలా చేస్తారా అంటూ ఏకిపారేశారు. ఇలాంటి కామెంట్లతో శాఖాపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. పైఅధికారులు ఆమెను విధులకు దూరంగా ఉంచారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా అధికారులు ప్రియాంకామిశ్రా రాజీనామాను ఆమోదించారు. విధుల నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా ఇలా వీడియోలు చేయకూడదన్న విషయం తనకు తెలియదని పశ్చాత్తావం వెలిబుచ్చిన ప్రియాంక మిశ్రా సోషల్ మీడీయా వేధికగా క్షమాపణలు చెప్పారు. వెంటనే వీడియోను డిలీట్ చేయడం జరిగిందని తెలిపారు. అప్పటికే వీడియో చూసిన నెటిజన్లు ‘రివాల్వర్ రాణి’ అంటూ ప్రియాంకను ట్రోల్ చేశారు.
https://youtu.be/ta8UkW0Uu1I

