
జర్నలిస్టు కుటుంబానికి చేయూత
– నర్సింహారెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం
– అందజేసిన టీయూడబ్ల్యూజే ఐజేయూ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు, కీర్తిశేషులు నరసింహా రెడ్డి కుటుంబానికి టీయూడబ్ల్యూజే-ఐజేయూ నేతలు చేయూతనందించారు. అనారోగ్యం కారణంగా జర్నలిస్టు నర్సింహారెడ్డి కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన స్వగ్రామం గాజీపూర్‌లోని నివాసంలో దినకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, తాండూరు డివిజన్ కార్యదర్శి దాసరి రామకృష్ణతో పాటు పలువురు జర్నలిస్టులు నర్సింహారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

అనంతరం టీయూడబ్ల్యేజే-ఐజేయూ తరుపున జర్నలిస్టుల నుంచి సేకరించిన రూ.23వేల 169లను నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సింహారెడ్డి మృతిపై విచారం వ్యక్తం చేశారు. అదేవిధంగా జర్నలిస్టులు ఒత్తిడి గురికాకుండా, అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ప్రతి ఒక్కరు ఆరోగ్య, జీవిత బీమా వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు అనారోగ్యం బారిన పడిన మరో జర్నలిస్టు సైమండ్ విషయంలో కూడా టీయూడబ్ల్యేజే తరుపున నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీబీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, టీయూడబ్ల్యూజే-ఐజేయూ ప్రతినిధులు మహేష్, డి.శ్రీనివాస్, పాండు, గయాజ్, కుమార్, గ్రామ పెద్దలు, బందుమిత్రులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

