కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..!

ఆరోగ్యం తెలంగాణ మహబూబ్ నగర్ హైదరాబాద్

కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..!
– వ్యర్థాలు కూడా బయటకు
– ఆరేళ్ల పాపకు వింత వ్యాధి
– కలకలం రేపుతున్న ఘటన
దర్శిని ప్రతినిధి: కళ్లలో నలక పడితేనే భరించలేం. అలాంటిది కంటి నుంచి నాన్‌స్టాప్‌గా ఇలా పెద్దపెద్ద పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, బియ్యపు గింజలు.. ఒక్కటేంటి, ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా రకరకాల ఐటమ్స్ వస్తున్నాయి. ఓ ఆరేళ్ల పాపకు ఈ వింత సమస్యతో ఇబ్బంది పడుతోంది. దీనికి కారణమేంటో వైద్యులు కూడా తెల్చలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కిష్ణాపురంకు చెందిన ఆరేళ్ల వయసున్న సౌజన్యకు కంటి నుంచి ఈ మధ్య తరచుగా ఇలాంటి వ్యర్థాలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా కంట్లో నుంచి వింత వస్తువులు బయటకు వస్తున్నాయి. ఈ మద్య కాలంలో నాన్‌స్టాప్‌గా ఇలా పెద్దపెద్ద పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, బియ్యపు గింజలు.. ఒక్కటేంటి, ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా రకరకాల ఐటమ్స్ వస్తున్నాయి. ఆ పాప కంట్లో నుంచి ఆ వస్తువులు వస్తున్న ప్రతిసారి భరించలేని నొప్పితో అల్లాడుతోంది. ట్రీట్‌మెంట్‌ కోసం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి సౌజన్యను తరలించారు. మెడికల్ లిటరేచర్‌లో కానీ, సైన్స్‌లో కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయంపై క్లారిటీ లేదన్నారు డాక్టర్లు. పాపను అబ్జర్వేషన్‌లో నుంచి కొన్ని టెస్టులు చేస్తామని.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు చెబుతున్నారు. పాప కంటిలో నుంచి వస్తువులు రావడం ఎలా సాధ్యమో.. ఎందుకు వస్తున్నాయో అర్థంకాక తల్లడిల్లిపోతున్నారు ఆమె తల్లిదండ్రులు. ఇక సౌజన్య కంటి పరిస్థితిని చూసేందుకు విచిత్రంగా చూస్తున్నారు జనాలు.

ఇది కూడా చదవండి…
‘మాతా శిశువు’ ఇక క్షేమం..!
– జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్‌లకు వైద్య పరికరాలు
– రూ.42.50 లక్షలతో అత్యాధునిక పరికరాల కొనుగోలు
– ఎమ్మెల్యే విజ్ఞప్తితో వైద్య శాఖ నుంచి నిధులు
https://dharshininews.com/17252
chaithany collage