తాండూరులో ఉచిత వైద్య శిబిరం
– మూత్రకోశ, కిడ్నీ సమస్యలకు వైద్య పరీక్షలు
– ఎల్లుండి సాయితరుణ్ ఆసుపత్రిలో నిర్వహణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ప్రజలకు సాయి తరుణ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి యజమాన్యం శుభవార్త చెప్పింది. ఎల్లుండి ఆదివారం ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి అధినేత డా.జయప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూత్రకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులపై శిబిరం కొనసాగుతుందన్నారు. ప్రముఖ వైద్యులు డా. గౌతంకృష్ణా రెడ్డి నేతృత్వంలో కిడ్నీలో రాళ్లు రావడం, ప్రోస్టేట్ గ్లాండు, మూత్రంలో మంట, కిడ్నీ రాళ్లతో కడుపునొప్పి, మూత్రంలో రక్తం రావడం, మూత్రంలో తెలుపు పోవడం, లైంగిక సమస్యలు, దంపతులకు పిల్లలు కాకపోవడం వంటి వ్యాధులు, సమస్యలపై ఉచితంగా వైద్య పరీక్షలు, సలహాలు అందజేస్తారని తెలిపారు. కావున తాండూరు పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

