తాండూరు స్మార్ట్‌ టౌన్‌గా మారాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు స్మార్ట్‌ టౌన్‌గా మారాలి
– స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌ను సక్సెస్ చెద్దాం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– మున్సిపల్ అత్యవసర సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణాన్ని వికారాబాద్‌ జిల్లాలోనే స్మార్ట్ టౌన్ గా మార్చుకునేలా అందరు కృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాయలంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కమీషనర్ శంకర్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షన్ – 2023 స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, మేరీ లైఫ్ మేరా స్వచ షెహర్ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులపై ప్రాధాన్యమివ్వడం జరుగుతుందని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిలింగ్ పై చర్చించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ కింద తాండూరు పట్టణాన్ని స్మార్ట్ టౌన్ మార్చుకుందామన్నారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను సక్సెస్ చేయడంలో అందరు భాగస్వాములు కావాలన్నారు. అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పారిశుద్ధ్యంలో తాండూరును ఆదర్శంగా నిలుపుదామన్నారు.

మున్సిపల్ జవాన్ కు నివాళులు
సమావేశంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మున్సిపల్ జవాస్ శ్రీసుకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, కమీషనర్ శంకర్ సింగ్, కౌన్సిలర్లు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ లు శోభారాణి, మధుబాల, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ఆసిఫ్, సాజిద్ అలీ, సిందూజ గౌడ్, సంగీత ఠాకూర్, బోంబీనా, బంటారం లావణ్య, సాహు శ్రీలత, ఆశ్విని గుండప్ప, మమత, ప్రభాకర్ గౌడ్, బాలప్ప, అస్లాం, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మేనేజర్ పరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా, శానిటరి ఇను స్పెక్టర్ ఉమేష్ కుమార్, అధికారులు, జవాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..!
– వ్యర్థాలు కూడా బయటకు
– ఆరేళ్ల పాపకు వింత వ్యాధి
– కలకలం రేపుతున్న ఘటన
https://dharshininews.com/17255
chaithany collage