బీజేపీతోనే దేశ ప్రగతి
– మోడి నాయకత్వంలో అవినీతి లేని పాలన
– 11 ఏండ్ల పాలనపై నేతల హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని ఆ పార్టీ నాయకులు అభివర్ణించారు. ఆదివారం దేశంలో బీజేపీ పాలన 11 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరులో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తదితరులు మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడి పాలనలో దేశం ఎన్నో రంగాల్లో పురోగతి చెందిందన్నారు.

ఆర్టికల్ 370, అయోధ్య రామ మందిరం, వక్స్ బోర్డు చట్టం, గరీబ్ కళ్యాణ్ యోజన, ఆయూష్మాన్ భారత్ వంటి ఎన్నో విజయాలను సాధించడం జరిగిందన్నారు. ఆర్థిక రంగంలో భారతదేశం నాలుగో స్థానంకు, క్రీడా, వ్యవసాయ, దేశ రక్షణ రంగాలలో పైపైకి ఎగబాకిందన్నారు. దేశంలో ఉగ్రవాదులను, మావోయిస్టులను మట్టుబెడుతూ ముందుఉఉ సాగుతుందన్నారు. మోడి నాయకత్వంలో దేశంలో అవినీతి లేని పాలన జరుగుతోందని అన్నారు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదాలతో అడుగులు వేస్తున్న బీజేపీకి అందరి ఆదరణలు దక్కుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సెల్ జిల్లా నాయకులు మోహన్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, మంతటి రాజు, శృతి, ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్, మైనార్టో మోర్చ్ అధ్యక్షులు షాబోద్దీన్, పట్టణ కమిటి సభ్యులు తాండ్ర నరేష్, చందు, సతీష్, బస్వరాజ్, సాయిలు, నందు, రాజు, శ్రీనివాస్, రాము, బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

