తిరుమలలో పట్నం ఫ్యామిలీ

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

తిరుమలలో పట్నం ఫ్యామిలీ
– శ్రీవారిని దర్శించుకున్న నూతన వధూవరులు
– సన్నిధిలో గడిపిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుటుంబం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర రవాణా శాఖ మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితామహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల వివాహా బంధంతో ఒక్కటైన మహేందర్ రెడ్డి, సునితారెడ్డిల కూతురు మనిషా రెడ్డి, హిమదీప్‌లతో కలిసి ఇరుకుటుంబాల సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబాల సమేతంగా శ్రీవారిని దర్శించుకుని సన్నిధిలో సేదతీరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వియ్యంకులు ఎన్వీ రమణారెడ్డి, చాముండేశ్వరి దంపతులు, పట్నం వారసుడు పట్నం రీనిష్ రెడ్డి, బందువులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..!
– వ్యర్థాలు కూడా బయటకు
– ఆరేళ్ల పాపకు వింత వ్యాధి
– కలకలం రేపుతున్న ఘటన
https://dharshininews.com/17255
chaithany collage