కొత్త సారుథులు వ‌చ్చేస్తున్నారు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

కొత్త సారుథులు వ‌చ్చేస్తున్నారు
– నేడు మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీల ఎన్నిక
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ ద‌ళానికి కొత్త సార‌ధులు రాబోతున్నారు. నేడు మంగ‌ళ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిల సంయుక్త స‌మావేశంలో కొత్త క‌మిటిలను ప్ర‌క‌టించ‌బోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల‌, బ‌షీరాబాద్ మండ‌లాల‌తో పాటు తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శుల‌ను ఎన్నుకోబోతున్నారు. ఇప్ప‌టికే తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షున్ని ఎన్నుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగింది. ఎమ్మెల్యే వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు అఫ్పూ(న‌యూం)ను ప‌ట్ట‌ణ అధ్య‌క్షులుగా ఎన్నుకున్న‌ట్లు తెలిసింది. మ‌రికాసేప‌ట్లో ఈ ప్ర‌చారానికి తెర‌ప‌డ‌పోనుంది. ప‌ట్ట‌ణంలోని హైద‌రాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న దుర్గా గ్రాండ్యూర్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కొత్త సార‌ధుల‌ను ఎన్నుకోతున్నారు. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ రాములు ముఖ్య అతిథిగా హాజ‌రుకాబోతున్నారు. అదేవిధంగా ఎంపీ రంజిత్ రెడ్డి, రాష్ట్ర కార్య‌ద‌ర్శి, తాండూరు పార్టీ ఇంచార్జ్ జ‌హాంగీర్ పాష‌లు పాల్గొంటున్నారు.