బైకుపై వెళుతూ కుప్పకూలిన వ్యక్తి
– సీపీఆర్‌తో పునర్జన్మ అందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్
– అభినందించిన అధికారులు, ప్రజలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా నగర పోలీసులకు ఉన్నతాధికారులు సీపీఆర్ శిక్షణ ఇప్పించారు. అది నగరప్రజల పాలిటవరంలా మారింది. ట్రాఫిక్ పోలీసులు, ఇతర పోలీసులు సీపీఆర్ చేసి అనేకమందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే తాజాగా వరంగల్ హనుమకొండలో జరిగిన ఈ సంఘటన. వివరాల్లోకి వెళితే.. వరంగల్ హన్మకొండకు చెందిన రాజు అనే వ్యక్తి బైక్‌పైన వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలంకార్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి వెంటనే స్పందించి రాజుకి గుండెపోటు వచ్చినట్టు గుర్తించి ఆలస్యం చేయకుండా వెంటనే సీపీఆర్ చేసాడు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రికి తలరించాడు. దాంతో రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. గుండెపోటుకు గురైన రాజు స్థానిక రేషన్ షాపు డీలర్‌గా గుర్తించారు. సీపీఆర్ ద్వారా అతని ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామిని సిటీ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అభినందించారు. CPR పట్ల పోలీస్ సిబ్బందికి సీపీ ఇప్పించిన శిక్షణ సత్పలితాలిస్తుండడంతో ప్రశంసలు కురిపించారు. మరోవైపు వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్, హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ రవి కుమార్ లు సైతం ట్రాఫిక్ కానిస్టేబులు చూపిన చొరవను అభినందించారు. నిండు ప్రాణం కాపాడి పోలీసుల ప్రతిష్టను పెంపొందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ చొరవను చూపి సీపీఆర్ శిక్షణ ఇప్పించడం వల్లే నిండు ప్రాణాన్ని నిలుప గలిగడాని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి…
సూపర్ పోలీస్..!
– నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ
– చాకచక్యంగా పట్టుకున్న తాండూరు పోలీసులు
– డీఎస్పీ చేతుల మీదుగా రివార్డులు
https://dharshininews.com/17404


