గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీ చర్యలు

తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీ చర్యలు
– జిల్లాలో 15 పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ -1 పరీక్షకు వికారాబాద్‌ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ తెలిపారు. శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్ 1 పరీక్షలకు 15 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 4857 మంది అభ్యర్థులకు హాజరు కాబోతున్నారని వెల్లడించారు. పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బంది కల్గకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దాదాపుగా 86 మంది పోలీస్ అధికారులతో పరీక్షలకు ఇట్టి బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఏమైనా అవసరం అయితే పోలీస్ అధికారులకు లేదా డైల్ 100 కు గాని సంప్రదించవచ్చని సూచించారు. అభ్యర్థులకు ఆల్‌దిబెస్ట్ చెప్పారు. అదేవిధంగా బందోబస్త్ లో పాల్గొనే పోలీస్ అధికారులకు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధులు కేటాయించిన ప్రాంతంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నత అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. బందోబస్త్ విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage