నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య

క్రైం రాజకీయం వికారాబాద్

నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
– పరిగి మండలంలో కలకలం
– కేసు నమోదు చేసుకున్న పోలీసులు

పరిగి, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన జిల్లాలోని పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శిరీష(19) ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్‌ శిక్షణ తీసుకుంటోంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది. యువతి తలపై, కళ్ళలో పొడిచి దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు శవాన్ని నీటి కుంటలో పడేశారు. ఆదివారం మధ్యాహ్నం నీటి కుంట దగ్గర యువతి దుస్తులను గుర్తించిన స్థానికులు పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు పోలీసులు నీటి కుంటలో నుండి యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. యువతి మృతదేహం పై కత్తి ఘాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన యువతి వికారాబాద్ కేంద్రంలో పారా మెడికల్ కోర్సు చేస్తుంది. అయితే గత రెండు నెలల నుండి కుటుంబ సభ్యులు కళాశాలకు వెళ్లకుండా మాన్పించారు. సంఘటన స్థలానికి స్థానిక డి.ఎస్.పి కరుణాసాగర్ రెడ్డి చేరుకొని పరిశీలించారు. స్థానికులను కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డి.ఎస్.పి వెంట ఎస్సై విట్టల్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

ఇదికూడా చదవండి…
chaithany collage