విద్యార్థులపై సర్కారు ప్రత్యేక దృష్టి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులపై సర్కారు ప్రత్యేక దృష్టి
– సర్కారు బడుల్లోనే విద్యార్థులకు గుణాత్మక విద్య
– తాండూరు ఎంపీపీ సంగెం అనిత, జెడ్పాటీసీ గౌడి మంజుల
– విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తోందని తాండూరు ఎంపీపీ సంగెం అనిత రవిందర్ గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశంలు అన్నారు. మంగళవారం తాండూరు మండలం మల్కాపూర్ లోని ఎంపీపీఎస్ పాఠశాలలో హెచ్ఎం నాగప్ప ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అనిత గౌడ్, జెడ్పీటీసీ మంజులలు హాజరై విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, రెండు యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. విద్యార్థుల కోసం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లను అందిస్తున్నారు. విద్యార్థులు అందరు శ్రద్ధగా చదువుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, ఎంఈఓ వెంకటయ్య గౌడ్, సర్పంచ్ విజయలక్ష్మీ పండరి, ఎంపీటీసీ రవి శిందే, ఉపసర్పంచ్ మాజిద్, మాజీ ఉపసర్పంచ్ షేక్ హసన్ పటేల్, గనికార్మిక సంఘం మాజీ వైస్ చైర్మన్ పండరీ, ఎస్ఎంసీ చైర్మన్ మైనోద్దీన్, టీచర్లు జ్యోతి, శిరీష యూసుఫ్, జయశ్రీ, భాగ్యశ్రీ, స్వప్న కుమారి, ఉమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage