ప్రతి ఇంటిపై జెండా ఎగరేద్దాం..!
– టీజేఏస్ తాండూరు ఇంచార్జ్ సోమశేఖర్
– 34వ వార్డులో జాతీయ జెండాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రతి ఇంటిపై అందరు జాతీయ జెండాలను ఎగురవేయాలని తెలంగాణ జన సమితి(టీజేఎస్) తాండూరు ఇంచార్జ్, కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని తన వార్డు 34లో ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏండ్లు గడుతున్న నేపథ్యంలో దేశమంతా స్వాతంత్ర్య సంబరాలను జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా అందరు దేశ భక్తిని చాటే విధంగా ఇంటింటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. ఇంట్లో ఉన్న పెద్దలతో పాటు చిన్నారులు దేశభక్తిని, జాతీయ సమైక్య భావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఆర్పీ గోవిందమ్మ, టీజేఎస్ కార్యకర్తలు జగ్గప్ప, మహేష్, ఇమ్రాన్, రాయుడు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.




