అత్తరు చల్లి.. గంజాయి రవాణా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అత్తరు చల్లి.. గంజాయి రవాణా..!
– రైల్లో ఒడిశా టు ముంబయ్‌కి తరలింపు
– పక్కా సమాచారంతో 45.6 కిలోలను స్వాదీనం
– గుట్టురట్టు చేసిన వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : గంజాయి రవాణాకు కేటుగాళ్లు స్మార్ట్ ప్లాన్‌ వేశారు. వాసన రాకుండా అత్తరు చల్లి.. అందంగా ప్యాకింగ్ చేసి రవాణా సాగిస్తున్నారు. చివరకు ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. ఒరిస్సా టు ముంబయ్‌కి గుట్టుగా సాగిస్తున్న గంజాయి రవాణాను వికారాబాద్‌ ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిషాకు చెందిన పరీక్షిత్‌ స్వామి, దీపేంద్ర సాగర్‌లు మంగళవారం ఒడిశా నుంచి ముంబాయికి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్‌లో గంజాయి రవాణా చేస్తున్నారు. రైల్లో ప్రయాణికులకు గంజాయి వాసన రాకుండా అత్తరు చల్లిన ప్యాకింగ్‌లో వాటిని తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు రైల్వే పోలీసుల సహాకారంతో దాడులు చేపట్టారు. జిల్లాలోని తాండూరు రైల్వే స్టేషన్ లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 45.6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చంద్ర తెలిపారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage