ఘనంగా పటేల్ శ్రీశైలం జన్మదిన వేడుకలు
– శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన నాయకులు, వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు, టీఆర్సీ అధ్యక్షులు, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం 67వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
పటేల్ శ్రీశైలం జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి దాటిన తరువాత తాండూరు పట్టణం నెహ్రు గంజ్ సమీపంలో ఉన్న ఆయన నివాసంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాజం సభ్యులు, గంజ్ వ్యాపారులు పటేల్ శ్రీశైలంను శాలువాతో సత్కరించి.. పూల మాలలతో సన్మానించారు.అనంతరం పటేల్ శ్రీశైలం చేత కేక్‌ను కట్ చేయించారు.
శనివారం ఉదయం పటేల్ శ్రీశైలం జన్మదిన సందర్భంగా వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్ సభ్యులతో పాటు దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అధ్యక్షులు పటేల్ రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కట్కం వీరేందర్, పలువురు పట్టణ వ్యాపారులు కల్వ రాధాకృష్ణ, దినేష్ సింగ్ ఠాకూర్, మంకాల రవీందర్, బంటారం సుధాకర్, సల్లా దామోదర్, దర్మీది ప్రభు, అంపణ్ణ శరణు, అభిమానులు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. మరోవైపు కుమారులు పటేల్ కిరణ్ కుమార్, పటేల్ ప్రవీణ్, మనుమండ్లు, మనుమరాండ్లు కూడ శుభాకాంక్షలు తెలిపారు.

