మెరుగైన వైద్య సేవలు అందించాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– దివ్య చిల్డ్రన్స్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం యాదిరెడ్డి చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన దివ్య పిల్లల క్లీనిక్ ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తాండూరు మండలం మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు కొత్త నర్సయ్య గౌడ్ కుమారులు డాక్టర్ ప్రవీణ్ గౌడ్, కోడలు డాక్టర్ దివ్య గౌడ, మరో కుమారుడు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కొత్త నర్సయ్య గౌడ్, ఇద్దరు కుమారులు, కోడళ్లు వైద్య వృత్తిలో రాణిస్తూ సేవలందించడంపై అభినందనలు తెలిపారు. దివ్య క్లీనిక్ ద్వారా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సర్సయ్య గౌడ్, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, పలువురు రాజకీయ నేతలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…


