తాండూరులో యోగా శిక్షణ తరగతులు
– రేపటి నుంచి ప్రారంభం
– ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తాండూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో తరగతులు ప్రారభమవుతాయని అన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభముతాయని, ప్రముఖ యోగా గురూజీ శివానంద ఆచార్య నేతృతంలో తరగతులు జరుగుతాయన్నారు. ప్రతి రెండు బ్యాచ్ లకు యోగా లో శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఉదయం 50-30 గంటలకు ఒక బ్యాచ, సాయంత్రం 6 గంటల నుంచి 7-30 గంటల వరకు రెండో బ్యాచ్ కు శిక్షణ ఇస్తారని వివరించారు. 21వ తేది నుంచి పది రోజుల పాటు శిక్షణ తరగతులు కొనసాగుతాయని చెప్పారు. యోగా శిక్షణకు హాజరయ్యే ఔత్సాహికులు యోగా గురూజీ శివానంద ఆచార్యను సెల్: 6300037174, 9676161219లకు సంప్రందించాలని సూచించారు.
ఇది కూడా చదవండి….


