జిల్లా వక్ప్ బోర్డు మెంబర్‌గా తాండూరు వాసికి అవ‌కాశం

తాండూరు వికారాబాద్

జిల్లా వక్ప్ బోర్డు మెంబర్‌గా తాండూరు వాసికి అవ‌కాశం
– నియామ‌క‌మైన అడ్వకేట్ యూనుస్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : జిల్లా వక్ప్ బోర్డు మెంబర్‌గా తాండూరు వాసికి అవ‌కాశం ల‌భిందించి. ప‌ట్ట‌ణానికి చెందిన న్యాయ‌వాది యూనుస్ వ‌క్స్‌బోర్డు మెంబ‌ర్‌గా నియామ‌క‌మ‌య్యారు. ఈ మేరకు సోమ‌వారం మైనారిటీ వెల్ఫేర్ జిల్లా అధికారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ వక్ప్ బోర్డు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో వక్ప్ బోర్డు భూములు, విద్యాసంస్థల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. వక్ప్ బోర్డు మెంబర్‌గా నియామ‌క‌మైన సంద‌ర్భంగా ఇందుకు స‌హ‌క‌రించిన చేవేళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు గ‌డ్డం రంజిత్ రెడ్డి, హైదరాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అసదుద్దీన్ ఓవైసీ, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎంఐఎం తాండూరు అధ్యక్షుడు హాదీ షహరీలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తనపై ఉంచిన న‌మ్మ‌కాన్ని కాపాడుకుంద‌నేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు.