టీఆర్ఎస్ బలోపేతానికి యువత తోడ్పడాలి
– పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి యువత తోడ్పడాలని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియామకమైన అప్పూ(నయూం)కు పార్టీ యువనాయకులు తెరాస నూతన పట్టణ అధ్యక్షుడిని సన్మానించిన యువనాయకులు సంతోష్ గౌడ్, బీసీ సంఘం నాయకులు రాజన్ గౌడ్, న్యాయవాది గోపాల్, ఇర్షాద్, ఇంతియాజ్, యోగి, రవి, చంటి యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అఫ్పూ మాట్లాడుతూ పట్టణంలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి యువత తోడ్పడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాకీర్, నిజాం, మోయిజ్, అజాజ్ తదితరులు పాల్గొన్నారు.
