వ్యాక్సీనేష‌న్‌లో మైలురాయిని చేరిన తెలంగాణ స‌ర్కారు

తెలంగాణ

వ్యాక్సీనేష‌న్‌లో మైలురాయిని చేరిన తెలంగాణ స‌ర్కారు
– రాష్ట్రంలో 2 కోట్ల టీకాల పంపీణీ పూర్తి : కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్
ద‌ర్శ‌ని ప్ర‌తినిధి : క‌రోనా వ్యాక్సీనేష‌న్ పంపిణీలో తెలంగాణ రాష్ట్రం మైలురాయిని చేరుకుంది. అతిత‌క్కువ స‌మ‌యంలోనే 2 కోట్ల మందికి టీకాలు పంపిణీని పూర్తి చేసింది. ఈ విష‌యాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దృవీక‌రించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ, జిహెచ్‌ఎంసి, జిల్లా అధికారులు చేసిన కృషితో ఈ ఘ‌నత‌ను సాధించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో 2 కోట్ల టీకాల లక్ష్యాన్ని సాధించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖ అధికారులను అభినందించారు.

టీకా ప్రక్రియ జనవరి, 2021 లో ప్రారంభమైందని, ఒక కోటి డోసులు 25 జూన్, 2021 న అంటే 165 రోజుల్లో వేయడం పూర్తయిందని, మొత్తం 2 కోట్ల డోసులను 15 సెప్టెంబర్ 2021 వరకు అంటే 78 రోజులలో చేరుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో మరో కోటి డోసులు వేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు.

రాష్ట్రంలో 52 శాతం అర్హులైన వారికి మొదటి డోసు ఇవ్వడం జరిగిందని, GHMC లో దాదాపు అందరికి మొదటి డోసు టీకాలు వేశామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హై ఎక్స్ పోజర్ గ్రూప్‌లలో 38 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అర్హులైన వ్యక్తులకు టీకాలు వేసేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి SAM రిజ్వీ, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ G. శ్రీనివాస్ రావు, OSD to Hon’ble CM డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.