తుల్జాపూర్ భవాని మాత సేవలో ఎమ్మెల్సీ
– కూకట్‌పల్లి ఎమ్మెల్యేతో కలిసి పూజలు
– సీఎం కేసీఆర్ భేటి తరువాత జోష్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేందర్ రెడ్డి జోష్ పెంచారు. సీఎం కేసీఆర్‌తో భేటి తరువాత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తాజాగా తుల్జాపూర్‌లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి తుల్జాపూర్‌లో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వెంట తాండూరుకు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్ంరావు, డీపీసీ మాజీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సీనీయర్ నాయకులు తాటికొండ పరిమళ్, కౌన్సిలర్ మణాపురం రాము తదితరులు ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తుల్జాపూర్‌లో పూజలు నిర్వహించడం పట్ల తాండూరులో జోరుగా చర్చించుకున్నారు. గత కొద్ది రోజులుగా తాండూరు రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్టు విషయంలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి భరోసా కల్పించడంతో ఆయన వర్గంలో పుల్ జోష్ నిండుకుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించినట్లు నేతలు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి…


