దేవుళ్లకు దొంగల శాపం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

దేవుళ్లకు దొంగల శాపం..!
– విగ్రహాలను ఎత్తుకెళుతున్న దుండగులు
– మొన్న దత్తాత్రేయ, నేడు భవానీ మాత విగ్రహాల అపరహణ
– తాండూరు మండలంలో సంఘటనలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: లోకాన్ని కాపాడుతున్నారని విశ్వసించే దేవుళ్ల విగ్రహాలకు రక్షణ లేకుండా పొయింది. విగ్రహాలను టార్గెట్ చేస్తూ దొంగలు ఎత్తుకెళ్లి పోతున్నారు. ఒకే గ్రామ పరిధిలో నెల 15 రోజుల్లో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలో జరిగిన ఈ సంఘటనలు కలకలంరేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం జినుగుర్తి గ్రామ గేటు సమీపంలో గత రెండేళ్ల క్రితం దత్తాత్రేయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత మే 10వ తేదిన గుడిలో ఉండాల్సిన దత్తాత్రేయ స్వామి విగ్రహాం మాయమైంది. దత్తాత్రేయ స్వామి విగ్రహ స్థానంలో గుర్తుతెలియని వ్యక్తులు చెంబును ఉంచి విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. పోలీసులు కూడా సంఘటనను పరిశీలించారు.

తాజాగా అదే జినుగుర్తి గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భవానీ మాత విగ్రహం చోరీకి గురైంది. శుక్రవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ అర్చకులు శివకుమార్ స్వామి శుక్రవారం దేవాలయాన్ని తెరచి చూడగా శివలింగం వద్ద ఉన్న భవానీ మాత విగ్రహం కనిపించలేదు. దీంతో ఆయన ఆలయ చైర్మన్ ప్రవీణ్‌ గౌడ్‌కు సమాచారం అందించారు. వెంటనే వారు కరణ్‌ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా జినుగుర్తి గ్రామంలో దేవుళ్ల విగ్రహాలు చోరీకి గురికావడం పట్ల సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. దేవుళ్లకే దొంగల శాపం అంటిందా అని జోరుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి దేవుళ్ల విగ్రహాల చోరీలు గ్రామంలో కలకలం రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage