వర్గాల్లేకుండా గులాబీవృద్ధి..!
– పార్టీ మరింత బలోపేతమే లక్ష్యం
– టీఆర్ఎస్ నూతన పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గాల్లేకుండా పార్టీని మరింద వృద్ధిలోకి తీసుకవచ్చేందుకు కృషి చేస్తానని ఆ పార్టీ తాండూరు పట్టణ నూతన అధ్యక్షులు అఫ్పూ(నయూం) పేర్కొన్నారు. తనకు పట్టణ పదవిని కట్టబెట్టడంపై సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందరెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, పార్టీ సీనీయర్ నాయకులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాండూరులో ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గం అనే విభేధాలు లేకుండా అందరితో కలిసి ముందుకు సాగేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసమే అటు, ఇటు నేతలందరిని కలవడం జరుగుతుందని చెప్పారు. తాండూరులో వర్గాలు లేకుండా అందరిని ఓకేతాటిపైకి తీసుకవచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరితో కలిసి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని, ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేర్చి.. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అందరి సహాకారంతో ముందుకుసాగుతామని పేర్కొన్నారు.

