తాండూరుకు గరికపాటి రాక..!
– అతిరుద్ర మహాయాగంకు విచ్చేస్తున్న నర్సింహారావు
– ఆహ్వానించిన పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రముఖ తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు, పద్మశ్రీ గరిక పాటి నర్సింహారావు నేడు తాండూరుకు విచ్చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగానికి విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతినిధులు తెలిపారు. లోక కళ్యాణార్థం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరులో శ్రీ రాజశ్యామల, శతచండి, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంను మూడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహారాగానికి రావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గరికపాటిని ఆహ్వానించారు. ఈ మేరకు పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు తాండూరుకు వస్తున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం 4:00 గంటలకు యాగానికి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. కావున ఈ యాగం లో పాల్గొనే దంపతులు మరియు భక్తులు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొని ప్రవచనాలను అనుభూతి చెందాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…


