స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హా ఏర్పాటుకు స‌హ‌క‌రించాలి

తాండూరు వికారాబాద్

స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హా ఏర్పాటుకు స‌హ‌క‌రించాలి
– తాండూరులో ఘ‌నంగా జ‌యంతి ఉత్స‌వాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్ర‌హాన్ని ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని స‌ర్దార్ ప‌టేల్ యూత్ అసోసియేష‌న్ నాయ‌కులు అన్నారు. ఆదివారం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 146 వ జయంతి ఉత్స‌వాలు నిర్వ‌హించారు. బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ పిలుపు మేర‌కు స‌ర్దార్ ప‌టేల్ చౌర‌స్తాలో వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ చిత్ర‌ప‌టానికి పూల‌మాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వించదగిన వ్యక్తి అని కొనియాడారు. సుమారు 600 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తిగా, భారతదేశ ఉక్కు మనిషి గా పేరుగాంచినరని తెలిపారు. రాబోవు సంవత్సరంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఇందుకు అంద‌రు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, టైలర్ రమేష్, సర్దార్ పటేల్ యువజన సంఘం సభ్యులు కోటం సిద్ధి లింగం, మతిన్, బీసీ సంఘం సభ్యులు టైలర్ రమేష్, రాము ముదిరాజ్, బస్వరాజ్, గిరిజాపురం రమేష్ ముదిరాజ్, అజయ్, బాబా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.