ధైర్యంగా టీకా వేసుకోవాలి

తాండూరు వికారాబాద్

ధైర్యంగా టీకా వేసుకోవాలి
– కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్‌గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్ర‌జ‌లు ఎలాంటి అపోహ‌లు లేకుండా క‌రోనా టీకాను ధైర్యంగా వేసుకోవాల‌ని తాండూరు కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు, 25వ వార్డు కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్ అన్నారు. శుక్ర‌వారం ఇంటింటికి వ్యాక్సీనేష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భాక‌ర్ గౌడ్ హాజ‌రై వ్యాక్సీనేష‌న్‌ను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సీనేషన్‌పై ప్ర‌జ‌లు ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవద్ద‌న్నారు. 18 ఏండ్లు నిండిన ప్ర‌తి ఒక్కరు ధైర్యంగా టీకా వేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంఘం నాయ‌కులు గ‌డ్డం వెంక‌టేష్, అంగ‌న్‌వాడి టీచ‌ర్లు, ఏఎన్ఎం, ఆశ వ‌ర్క‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.