బ్రహ్మ గర్జనను జయప్రదం చేయండి
– టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం పురుషోత్తంరావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బ్రహ్మాణుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మ గర్జన బహిరంగ సభను జయప్రయడం చేయాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రహ్మ గర్జన వికారాబాద్ జిల్లా కన్వినర్ కరణం పురుషోత్తం రావు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ జరుగుతుందున్నారు. ఈ బ్రహ్మ గర్జన సభకు వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం, రాజకీయ పురోగమనానికి సిద్ధం కావాలని అన్నారు. బ్రహ్మ గర్జన సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…


