ఎన్నికల్లో బీసీలకే టిక్కెట్లు ఇవ్వాలి
– బీసీల రాజకీయ ప్లీనరీని విజయవంతం చేయాలి
– బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ ముఖ్యమంత్రితో పాటు మిషన్ 60(బీసీలకు 60 ఎమ్మెల్యే టిక్కెట్లు) డిమాండ్ తో నేడు జులై 15న హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కేబీఆర్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న బీసీల రాజకీయ ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. శుక్రవారం తాండూరు పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈడిగ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక శాతం బీసీలే ఉన్నప్పటికీ పిడికెడంత ఉన్న ఓ సామాజిక వర్గం నేతలే రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. వికారాబాద్ జిల్లాలో మూడు జనరల్ స్థానాలు ఉన్నా కూడా ఆ సామాజిక వర్గం నేతలే కొనసాగుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల ఒకే సామాజిక వర్గం నుంచి నేతలు పోటీ పడుతున్నారని అన్నారు. అందుకే 60 శాతం ఉన్న బీసీలు ఓటు మాదే, మాదే సీటు విధంగా రానున్న ఎన్నికల్లో కనీసం వికారాబాద్ జిల్లాలోని రెండు స్థానాలైనా బీసీలకు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీపీలు అధిపత్య పార్టీలకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అదేవిధంగా నేడు ఎల్బీ నగర్ లో నిర్వహిస్తున్న బీసీల రాజకీయ ప్లీనరికి బీసీలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ అధ్యక్షులు పర్యాద రామకృష్ణ, వికారాబాద్ జిల్లా యువజన అధ్యక్షులు గొట్టిగ అనిల్ కుమార్, అంజి గౌడ్, శశి కుమార్ గౌడ్, ప్రవీణ్, ప్రకాష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


