శభాష్… తరుణ్..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

శభాష్… తరుణ్..!
– తైక్వాండో, కుంపూలో బంగారు పతకాలు
– అభినందించిన బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: శభాష్.. తరుణ్ అంటూ బీఆర్ఎస్ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ అన్నారు. పట్టణంలోని 33వ వార్డుకు చెందిన స్వర్గీయ ఉదయ్ కుమార్ కుమారుడు తరుణ్(11) యాదవ్ అనే తైక్వాండో క్రీడాకారుడు బెంగలూరులో నిర్వహించే తైక్వాండో, కుంపూ పోటీలకు ఎంపికయ్యాడు. అయితే ఈ పోటీలో పాల్గొనేందుకు తరుణ్ కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ రూ. 10వేల ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించారు. దీంతో పోటీలో పాల్గొన్న తరుణ్ తైక్వాండో, కుంపూ విభాగాలలో రెండు బంగారు పతకాలను సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం అబ్దుల్ రవూప్‌ను కలిసిన క్రీడాకారుడు తరుణ్ ను శభాష్ అంటూ అభినందించారు. మరిన్ని పోటీలో పాల్గొని ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఇందుకు తనవంతు ప్రోత్సహాం అందిస్తామన్నారు. అనంతరం కోచ్ శాంతు కుమార్ ను, తరుణ్ లను శాలువాతో సత్కరించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage