తాండూరుకు అమృత్ అందలం..!
– రూ. 24 కోట్ల ఆధునీకరణకు శ్రీకారం
– వర్చవల్‌గా ప్రారంభించిన పీఎం మోడి
– హర్షం వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ కింద వికారాబాద్ జిల్లాలోని తాండూరు రైల్వే స్టేషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం చొరవతో దక్కిన అందలంతో పురోగతి దిశగా అడుగులు వేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం దేశంలోని 508 రైల్వేస్టేషన్లను నవీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాండూరు రైల్వేస్టేషన్ పురోగతి పనులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వర్చవల్‌గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ కింద రూ. 24.4 కోట్లతో చేపడుతు పురోగతితో తాండూరు రైల్వేస్టేషన్‌కు రాజయోగం వచ్చిందని కార్యక్రమానికి హాజరైన నేతలు అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ధి పనుల బోర్డును ఆవిష్కరించారు.

అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్, జిల్లా, అధ్యక్షులు సదానంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ తదితరులు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడి చొరవతో తాండూరు రైల్వేస్టేషన్ కు రూ. 24.4 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రత్యేక దృష్టితో తాండూరు రైల్వే స్టేషన్ కు రాజయోగం వచ్చిందన్నారు. అంతకుముందు అధికారులు మాట్లాడుతూ తాండూరు రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫారంల పునరుద్దీకరణ, ఎస్కలేటర్, లిప్టు తదితర సౌకర్యాలను కల్పించబోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సయ్యద్ వసీమ్ పాష, అధికారులు సీపీ రవిసింగ్, సురేష్ కుమార్, పాండు నాయక్, జీవి రెడ్డి. అరుణ్ షోరి, నటరాజ్, శ్యామ్ చౌహాన్, తాండూరు నాయకులు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మోడి ప్రసంగం
ఆకట్టుకన్న మోడీ ప్రసంగం
వర్చువల్ విధానంలో శంకుస్థాపన అనంతరం పీఎం మోడీ ప్రసంగించారు. నేడు ఆగస్టు 7న దేశం మొత్తం చేనేత దినోత్సవం జరుపుకుంటుందన్నారు. వచ్చే వినాయక చవితిలో పర్యావరణ. ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు. 8న క్విట్ ఇండియా దినోత్సవం, 14న అఖండ భారత దినోత్సవం, 15న హర్ ఘర్ తిరంగా పండగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి..

