రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు

తెలంగాణ

రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు
– అల‌ర్ట్ ప్ర‌క‌టించిన వాతావ‌ర‌ణ శాఖ
ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావర‌ణ శాఖ తెలిపింది. అధికారులు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తండా ఉండాల‌ని అలెర్ట్ ప్ర‌క‌టించింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపిన వాతావ‌ర‌ణ వాఖ అలాగే, బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింద‌ని తెలిపింది. ఇది నేడు ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచ‌నా వేశారు. దీని ప్రభావంతో నేడు స్వల్పంగా, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ప్ర‌జ‌లు, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.