తల్లిపాలే అమృతం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

తల్లిపాలే అమృతం
– కౌన్సిలర్ సంగీత ఠాకూర్
– బాలింతలు, గర్భిణీలకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తల్లిపాలే పిల్లల ఆరోగ్యంపై అమృతంలా పనిచేస్తాయని తాండూరు మున్సిపల్ పరిధి 20వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. తల్లిపాల వారోత్సోవాలలో భాగంగా సోమవారం వార్డులోని గాంధీనగర్‌ అంగన్ వాడి కేంద్రంలో బాలింతలు, గర్భిణీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ పుట్టిన శిశువులకు తల్లిపాలే అందించాలన్నారు. తల్లిపాలలో ఉన్న పోషకాలు పిల్లల ఆరోగ్యంపై ఔషదంలా పనిచేస్తాయన్నారు. చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదిగేందుకు అమృతంలా పనిచేస్తాయన్నారు. దీంతో పాటు పిల్లలకు తల్లిపాలు అందించడం వల్ల మహిళలు క్యాన్సర్ వంటి రోగాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. అనంతరం అంగన్‌ వాడి కేంద్రంలో గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ రాధ, ఆయమ్మ అనిత, గర్భిణీ, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!