అంతారం మాజీ ఎంపీటీసీ నర్సమ్మ కన్నుమూత
– రేపు గ్రామంలో అంత్యక్రియలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం అంతారం గ్రామ మాజీ ఎంపీటీసీ టీ.నర్సమ్మ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆదివారం తుదిశ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీలో మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగిన హాయంలో అంతారం గ్రామ ఎంపీటీసీగా నర్సమ్మ పనిచేశారు. ఆమె మరణ వార్త తెలిసిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు రేపు సోమవారం మధ్యాహ్నం అంతారంలో నర్సమ్మ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
