సర్కారు బడిలో నాణ్యమైన విద్య

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

సర్కారు బడిలో నాణ్యమైన విద్య
– కౌన్సిలర్ సంగీత అజయ్‌ సింగ్ ఠాకూర్
– గాంధీ నగర్ లో ఇంటింటికి బడిబాట
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తోందని తాండూరు మున్సిపల్ పరిధి 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని గాంధీ నగర్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఇంటింటికి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తో పాటు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ ఈనెల 12వ తేది వరకు బడిబాట కొనసాగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ బడుల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధించడం జరుగుతుందన్నారు. సర్కారు బడుల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గాంధీనగర్ పాఠశాల అభివృద్ధికి నిధులు. మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, అంగన్ వాడి టీచర్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

రైలు పట్టాలపై మృత్యుకేళీ..!

chaithany collage