– బీసీ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్‌కుమార్
– బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా శ్రీకాంత్ నియామకం
తాండూరు: విద్యార్థి సమస్యల పరిష్కారానికి బీసీ విద్యార్థి సంఘం పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. శనివారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో తాండూరు డివిజన్ బీసీ విద్యార్థి సంఘంను ఏర్పాటు చేశారు. సంఘం డివిజన్ అధ్యక్షులుగా శ్రీకాంత్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ శ్రీకాంత్‌కు నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పొరాటం చేయాలనే ఉద్దేశంతో ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు తాండూరు నియోజకవర్గ బీసీ విద్యార్థి సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అధ్యక్షులుగా నియామకమైన శ్రీకాంత్ విద్యార్థి సమస్యలపై పోరాటం చేయాలన్నారు. అదేవిధంగా బీసీ సమస్యలపై నిరంతరం పోరాటం చేసేందుకు విద్యార్థి సంఘాలతో పాటు మహిళ సంఘాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బీసీ రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్‌లు మాట్లాడుతూ విద్యార్థి దశ శక్తివంతమైందని, విద్యార్థి సమస్యలపై అన్ని సంఘాల కంటే బీసీ విద్యార్థి సంఘం ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షులు బోయ నరేష్ తాండూర్ బీసీ సంఘం నాయకులు రాధాకృష్ణ బస్వరాజ్ అఖిల్ విద్యార్థులు చక్రి కుశాల్ వినోద్ అభిషేక్ నిఖిల్ చారి పాల్గొన్నారు.